Exams Time Table: ఏ సబ్జెక్టు పరీక్ష ఏ రోజు జరుగుతుందో పరీక్షల ప్రారంభానికి వారం ముందు కాలపట్టిక(టైమ్‌టేబుల్) ప్రకటించడం ఎక్కడైనా ఉందా? రాష్ట్రంలో 1-9 తరగతుల పరీక్షలకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అదే చేసింది. అయితే అధికారులు 20 రోజుల క్రితమే ప్రతిపాదన పంపినా పాఠశాల విద్యాశాఖ కార్యాలయం కాలపట్టికకు ఆమోదం తెలపకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలిసింది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ-2) పరీక్షలు మొదలు కానుండగా బుధవారం ఆ పరీక్షల కాలపట్టిక విడుదలైంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు ఈ నెల 27వ తేదీన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పరీక్షల కాలపట్టికతోపాటు పలు సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలో ఎస్‌సీఈఆర్‌టీ బుధవారం కాలపట్టికను జారీ చేసింది. దాంతో డీసీఈబీ అధికారులు త్వరగా ప్రశ్నపత్రాలను ముద్రించి ఇవ్వాలని ప్రింటర్లకు విన్నవిస్తున్నట్లు సమాచారం.
Exams Time Table: పరీక్షలకు వారం ముందు కాలపట్టిక! - telangana news
Exams Time Table: పరీక్షల ప్రారంభానికి వారం ముందు కాలపట్టిక(టైమ్‌టేబుల్) ప్రకటించడం ఎక్కడైనా ఉందా? రాష్ట్రంలో 1-9 తరగతుల పరీక్షలకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అదే చేసింది. అయితే అధికారులు 20 రోజుల క్రితమే ప్రతిపాదన పంపినా పాఠశాల విద్యాశాఖ కార్యాలయం కాలపట్టికకు ఆమోదం తెలపకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలిసింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
Exams Time Table: పరీక్షలకు వారం ముందు కాలపట్టిక!