లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలకు భారతీయ స్టేట్ బ్యాంకు అండగా నిలిచింది. నగరంలో సుమారు 500 మంది వలస కూలీలకు అవసరమైన వస్తువులను అందచేసింది. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోల్నాక, కోఠి, మారేడ్‌పల్లిలోని షెల్టర్లలో వలసకూలీలకు టవళ్లు, ప్లోర్ మ్యాట్స్, బకెట్లు, మగ్గులు, నిత్యవసర సరకులు అందచేశారు.
వలస కార్మికులకు బాసటగా నిలిచిన ఎస్బీఐ
లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు భారతీయ స్టేట్ బ్యాంకు బాసటగా నిలిచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్నసుమారు 500 మంది కూలీలకు అవసరమైన వస్తువులను అందజేసింది.
వలస కార్మికులకు బాసటగా నిలిచిన ఎస్బీఐ
ఎస్బీఐ సీజీఎంగా ఇటీవల పదోన్నతి పొందిన వి.రమేశ్, డీజీఎం కేవీ బంగార్రాజు, ఏజీఎం హనుమంతరావు, ఎస్బీఐ ఇన్‌ఫ్రా గోపాల్ రెడ్డిలతోపాటు పలువురు అధికారులు వీటిని పంపిణీ చేశారు. అందరూ నిత్యవసర సరకులు పంపిణీ చేస్తుండగా.. ఇతర వస్తువులు అందచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల విద్యార్థుల గోస