తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్... ఇతర రాష్ట్రాలకూ విస్తరించింది. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చేరింది. గ్రీన్ ఛాలెంజ్ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మరోసారి మొక్కనాటారు. ఈ సారి కూడా మరో నలుగురికి మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు. వైకాపా ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు జీఎమ్మార్ అధినేత గ్రంథి మల్లిఖార్జున్ రావు, నటుడు అక్కినేని అఖిల్‌ను మొక్కలు నాటాల్సిందిగా సంతోష్ కోరారు.
మళ్లీ గ్రీన్ ఛాలెంజ్ విసిరిన తెరాస ఎంపీ సంతోష్ - green challenge
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్.. ఇతర రాష్ట్రాలకూ విస్తరించింది. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చేరింది. గ్రీన్ ఛాలెంజ్ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
మల్లిఖార్జున్ రావు, మిథున్ రెడ్డి, అఖిల్ వెంటనే దీనిని అంగీకరిస్తున్నట్లు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మల్లిఖార్జున్ రావు స్వయంగా మొక్కను నాటి హరితహారంపై తన ఆకాంక్షను వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, తిరిగిరాగానే మొక్కలు నాటుతానన్నారు. మిథున్ రెడ్డి మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. మిథున్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన సుప్రియా సూలే ఇవాళ తన నియోజకవర్గం పరిధిలోని ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నామినేట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి;అవి కలుపు మొక్కలు కాదు.. తినొచ్చు