అయితే హిదాయత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ షాహిద్ పేదలకు సాయం చేయాలని పరితపించాడు. చిన్న కిరాణ కొట్టు నడిపిస్తూ జీవితం సాగిస్తున్నా.. మొహమ్మద్ ఉన్న దాంట్లో సాయం చేయాలనుకున్నాడు. అర్ధరాత్రి రోడ్ల పక్కన పడుకున్న అభాగ్యులకు దుప్పట్లు కప్పి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.
రాత్రి వేళల్లో పోలీసులు కూడా సరిగ్గా పడుకోనివ్వడంలేదని రోడ్ల పక్కన పడుకున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఇళ్లు లేవని.. కనీసం రోడ్డు పక్కన పడుకుందామంటే.. ఎప్పుడు ఎవరొచ్చి వెళ్లగొడతారో అని భయంభయంగా ఉంటుందన్నారు. ఒక్కోసారి వాహనాలు వేగంగా వచ్చి మీదకు దూసుకొచ్చిన ఘటనలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. అలా చనిపోయినా.. పట్టించుకునే వారు ఉండరన్నారు. చనిపోయిన వారికోసం ఎవ్వరూ రాకపోవడం వల్ల వారిని అలాగే తీసుకెళతారని పేర్కొన్నారు.
చలిలో రోడ్ల పక్కే నివాసం.. శునకాలతో సావాసం.. - హిదాయత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ షాహిద్
చలికాలం అంటేనే వణుకుపుడుతోంది. ఇంట్లోనే రెండు, మూడు దుప్పట్లు కప్పుకుంటే గానీ చలి ఆగదు. అటువంటింది రాత్రివేళ రోడ్ల పక్కన నిద్రించడమంటే మాములు విషయం కాదు. వందలాది అభాగ్యులు చలికి వణుకుతూ పాదచారులు వెళ్లే దారిలో నిద్రిస్తున్నారు. చలికి తట్టుకోలేక రోడ్డుమీద దొరికే ప్లాస్టిక్ కవర్లనే కొందరు దుప్పట్లుగా కప్పుకుంటున్నారు. మరికొందరు శునకాలతో సావాసం చేస్తున్నారు. హైదరాబాద్లో కన్పించిన ఇలాంటి దృశ్యాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
చలిలో రోడ్ల పక్కే నివాసం.. శునకాలతో సావాసం..
రోడ్లపక్క జీవితం.. గాలిలో దీపం లాంటిదని బాధితులు అభిప్రాయపడుతున్నారు. ఎంతవరకు బతుకుతామో తెలియదని.. జీవించినంత కాలం.. ఇలా రోడ్లమీదనే ఉంటామంటున్నారు. ప్రభుత్వం ఆదుకుని రాత్రి వేళ పడుకునేందుకు ఆశ్రమం కల్పించాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: 'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'