తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 26న రిటైర్డ్​ ఉద్యోగుల మహా ధర్నా

తమ సమస్యలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు డిమాండ్​ చేశారు. మరోమారు తమ గోడును వినిపించడానికే ఈ నెల 26న మహాధర్నా నిర్వహిస్తున్నామని రిటైర్డ్​ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.

By

Published : Aug 21, 2019, 7:50 PM IST

ఈ నెల 26న రిటైర్డ్​ ఉద్యోగుల మహా ధర్నా

వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి పదవీవిరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి తమ డిమాండ్లను అనేక సార్లు వివిధ రూపాల్లో తీసుకెళ్లిన పట్టించుకోక పోవడంతో ఈనెల 26న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. మొట్ట మొదటి పే రివిజన్ నివేదిక అమలు చేయాలని, ఐఆర్ మధ్యంతర భృతి కనీసం 35శాతం ప్రకటించాలని కోరారు. కరవు భత్యం మంజూరు, పీఆర్సీ సిఫార్సు మేరకు 70ఏళ్లు వారికి అదనపు పింఛన్ చెల్లించాలని... తెలంగాణ ఇన్​సెంటివ్ మంజూరు చేయాలన్న తదితర డిమాండ్లను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 26న రిటైర్డ్​ ఉద్యోగుల మహా ధర్నా

ABOUT THE AUTHOR

...view details