తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాలెట్ బాక్సులకు సీల్... డీఆర్సీకి తరలింపు - ballot boxes seal

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వివాదాలు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం అధికారులు బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి డీఆర్సీకి తరలించారు.

results stores in ballot box
బ్యాలెట్ బాక్సులకు సీల్... డీఆర్సీకి తరలింపు

By

Published : Mar 14, 2021, 7:23 PM IST

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 4 గంటల వరకే సమయం ఇచ్చినప్పటికీ... అప్పటికే క్యూలైన్లో నిలిచిన ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.

అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తును అందుబాటులో ఉంచారు. హైదరాబాద్​లో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులకు సీల్​ వేసి పోలింగ్ అధికారులు... పోలీసుల సాయంతో సరూర్​నగర్​లోని డీఆర్సీకి తరలించారు.

ఇదీ చూడండి:ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్‌.. క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం

ABOUT THE AUTHOR

...view details