తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్ ఆస్పత్రి వద్ద రెసిడెంట్ వైద్యుల ధర్నా - DOCTORS DDHARNA

వైద్యం సరిగ్గానే చేసినప్పటికీ... భద్రతా సిబ్బంది లేకపోవడం వల్లే కొందరు తమపై దాడి చేస్తున్నారంటూ నిమ్స్ ఆస్పత్రి రెసిడెంట్ వైద్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అత్యవసర విభాగం ముందు బైఠాయించారు.

నిమ్స్ ఆస్పత్రి వద్ద రెసిడెంట్ వైద్యుల ధర్నా

By

Published : May 20, 2019, 4:52 PM IST

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి వైద్యుడిపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... రెసిడెంట్ వైద్యులు ధర్నాకు దిగారు. అత్యవసర విభాగం ఎదుట బైఠాయించారు. ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో భద్రత లేకపోవడం వల్ల తరచూ దాడులు జరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భయాందోళనల మధ్య విధులు నిర్వహించడం కష్టంగా ఉందని తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో సరైన భద్రతా సిబ్బంది పెంచాలంటూ నినాదాలు చేశారు.

నిమ్స్ ఆస్పత్రి వద్ద రెసిడెంట్ వైద్యుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details