తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టంతో తగ్గనున్న రిజిస్ట్రేషన్​ శాఖ ఆదాయం

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు కారణంగా రాబడికి గండిపడనుంది. లాక్‌డౌన్‌ కారణంగా నెలన్నర రోజులకుపైగా స్తంభించిన రిజిస్ట్రేషన్లు తాజాగా మరో 20 రోజులపాటు ఆగిపోనున్నాయి.

కొత్త రెవెన్యూ చట్టంతో తగ్గనున్న రిజిస్ట్రేషన్​ శాఖ ఆదాయం
కొత్త రెవెన్యూ చట్టంతో తగ్గనున్న రిజిస్ట్రేషన్​ శాఖ ఆదాయం

By

Published : Sep 10, 2020, 5:02 AM IST

కొత్త రెవెన్యూ చట్టంతో తగ్గనున్న రిజిస్ట్రేషన్​ శాఖ ఆదాయం

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సమగ్ర వివరాలతో సిద్దమైంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తిగా తహసీల్దార్లకు అప్పగిస్తున్నందున.. అందుకు అనుగుణంగా సాప్ట్‌వేర్‌ సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వ్యవసాయ భూములు మండల రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ.. వాటికి చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఈ స్టాంపుల విక్రయాలకు సంబంధించిన రాబడి మాత్రం రిజిస్ట్రేషన్ల శాఖ ఖాతాలోనే జమవుతుందని ఆ శాఖ వెల్లడిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి రెండు నుంచి మూడు వారాల వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ చిరంజీవుల నేతృత్వంలో అధికారుల బృందం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా, జిల్లాల వారీగా, డీఐజీ వారీగా రిజిస్ట్రేషన్లకు చెంది సమగ్ర వివరాలు రూపొందించారు. ఏయే కేటగిరి రిజిస్ట్రేషన్లు ఎన్ని జరుగుతున్నాయని.. ప్రభుత్వం అడిగితే ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ప్రధానంగా వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను విభజించి పెట్టారు. రాబడులకు చెందిన వివరాలు కూడా కేటగిరిల వారీగా ఎంత ఆదాయం వస్తుందన్న కోణంలో కూడా అధికారులు ఆరా తీశారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో తాజాగా నెలకొన్న పరిస్థితులు, కరోనాతో నెలన్నర రోజులపాటు రిజిస్ట్రేషన్లు స్తంభించిపోవడం లాంటివి ఆ శాఖకు వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక ఏడాదిలో దాదాపు 17 లక్షల మేర రిజిస్ట్రేషన్లు జరిగి రూ.6,446 కోట్లు రాబడిరాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పదివేల కోట్లు రాబడి లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఆర్థిక ఏడాది ఆరంభం నుంచి ఒకదాని తర్వాత ఒకటి రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆటంకాలు ఎదురవుతుండటం వల్ల ఆ ప్రభావం ఆదాయంపై పడుతోంది. మార్చి చివరి వారం నుంచి మే 10 వరకు లాక్‌డౌన్‌ కారణంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా స్తంభించాయి. ఆ తరువాత తెరచినా.. కరోనా ప్రభావంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ లాంటివి పూర్తికావడానికి మరో 20 రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పదివేల కోట్ల రాబడిగా నిర్దేశించుకున్నా.. రిజిస్ట్రేషన్ల శాఖలో మార్పులు, కరోనా ప్రభావంతో నాలుగో వంతు రాబడి.. అంటే సుమారు రూ. రెండున్న వేల కోట్ల మేర తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:'రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 21, 041 ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులు'

ABOUT THE AUTHOR

...view details