తెలంగాణ

telangana

ETV Bharat / state

'డీలర్లు సమయానికి రావట్లేదు.. మిషన్లు సాంకేతికంగా పని చేయట్లేదు'

రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం సరఫరా వివిధ ప్రాంతాల్లో ఆలస్యం అవుతోంది. పలు చోట్ల మిషన్​లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పాటు... మరికొన్ని ప్రాంతాల్లో డీలర్లు సకాలంలో రాక...ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

ration-problems-at-hyderabad
'డీలర్లు సమయానికి రావట్లేదు.. మిషన్లు సాంకేతికంగా పని చేయట్లే'

By

Published : Apr 5, 2020, 12:10 PM IST

ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం సరఫరా వివిధ ప్రాంతాల్లో ఆలస్యం అవుతోంది. రేషన్ డీలర్లు సకాలంలో రాకపోవడం, మిషన్​లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రజలు విసిగిపోతున్నారు.

'డీలర్లు సమయానికి రావట్లేదు.. మిషన్లు సాంకేతికంగా పని చేయట్లే'

నారాయణగూడ విఠల్​వాడీలో ఉదయం ఏడు గంటల నుంచే రేషన్ సరుకుల కోసం ప్రజలు బారులు తీరారు. తొమ్మిది గంటలకు రావల్సిన డీలర్ సకాలంలో రాకపోవడంతో ఎండలో నిలబడ్డారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటూ సామాజిక దూరం పాటించకపోవడంతో... అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు దూరంగా ఉండాలని సూచించారు.

ఇవీచూడండి:పేదలపై లాక్​డౌన్​ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే అంతే!

ABOUT THE AUTHOR

...view details