తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేషన్ డీలర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి' - ఒకే సంఘం ఒకే నినాదం

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక జరిగింది. సమావేశంలో సభ్యుల మధ్య విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి.

'రేషన్ డీలర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి'

By

Published : Aug 30, 2019, 6:52 AM IST

Updated : Aug 30, 2019, 7:28 AM IST

హైదరాబాద్ లక్డీకపూల్​లో తెలంగాణ రాష్ట్ర చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక జరిగింది. 'ఒకే సంఘం ఒకే నినాదం' అన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర డీలర్ల సమావేశానికి 33 జిల్లాల నుంచి డీలర్లు హాజరయ్యారు. డీలర్ల సంక్షేమ సంఘాల నేతల మధ్య విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఎన్నికల సమయంలో డీలర్లను అన్ని రకాలుగా ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్ హామీని నెరవేర్చాలని నూతన అధ్యక్షుడు నాయికోటి రాజు విజ్ఞప్తి చేశారు.గతంలో ఇదే అంశంపై ఒక అడహాక్ కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా దొమ్మాటి రవీందర్‌ను నియమించారు. సంఘాలకు అతీతంగా పాత బకాయిలు విడుదల, కమీషన్ పెంపు, పక్కా గృహాలు, పిల్లలకు విద్యా రాయితీలు కల్పించాలని డీలర్లు కోరారు.

'రేషన్ డీలర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి'
Last Updated : Aug 30, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details