పవిత్ర రంజాన్ మాసంలో యావత్ ముస్లిం సమాజం ఇళ్లల్లోనే ప్రార్థనలు చేయాలని జామియా నిజామియా వీసీ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, ముస్లిం మత పెద్దలు, ఉలేమాలు, ముఫ్తీలు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జామియా నిజామియా తరఫున నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు - lockdown time ramadan prayers at home
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్ సందర్భంగా ముస్లీం సమాజం ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచి మే 23 వరకు కొనసాగనున్న రంజాన్ పండుగను ఇళ్లల్లోనే జరపుకోవాలని హైదరాబాద్‌లోని జామియా నిజామియా నిర్ణయించింది. ముస్లిం మత పెద్దలు, ఉలేమాలు, ముఫ్తీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు
లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున రంజాన్ మాసంలో ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేయాలని ఇస్లామిక్ థాట్‌కు చెందిన పాఠశాలల ఉలేమాలు, ముఫ్తీలు సూచించారు.
ఇదీ చూడండి :ఆందోళన వద్దు.. జాగ్రత్తలు ముద్దు