హైదరాబాద్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని స్కూప్స్ ఐస్ క్రీమ్ యాజమాన్యం ఆధ్వర్యంలో సుమారు 200 మంది స్థానిక, వలస కార్మికులకు ఐదు రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు.
'వలస కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిది' - 'వలస కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిది'
కరోనా నేపథ్యంలో వలస కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు స్కూప్స్ ఐస్ క్రీమ్ యాజమాన్యం నిత్యావసర సరుకులను అందజేసింది.
'వలస కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిది'
ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ భౌతిక దూరం పాటించాలని, మాస్కులను ధరించాలని, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే తెలియ చేయాలని సూచించారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని, ఇళ్లలోనే ఉండాలని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కంపెనీ యాజమాన్యాలే కార్మికులను ఆదుకోవాలని స్కూప్స్ ఐస్ క్రీమ్ యాజమాన్యం తెలిపింది.
ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?