రానున్న రోజుల్లో రాష్ట్రంలో అవసరమైతే రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని.. సెప్టెంబరు నెలఖారుకు పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని ఆయన అంచనా వేశారు. వారం రోజుల్లో రాష్ట్రంలో రెండో విడత యాంటీ బాడీ పరీక్షలు జరపనున్నట్లు తెలిపారు.
'సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి నియంత్రణలోకి కరోనా'
రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలోనే ఉందని... రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో కేసులు తగ్గుముఖం పట్టాయన్న ఆయన.. సెప్టెంబర్ నెలాఖరుకు జిల్లాల్లోనూ నియంత్రణలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2 నెలలుగా పరీక్షలు పెరిగాయని... ఇప్పటివరకు 10.21 లక్షలు చేసినట్లు వివరించారు.
'సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి నియంత్రణలోకి కరోనా'
కరోనా కారణంగా ఆహార, పరిశుభ్రతలపై జాగ్రత్తలు తీసుకుంటున్నందున.. ఈ ఏడాది సాధారణ సీజనల్ వ్యాధులు కూడా తక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు పెట్టవద్దని.. ఆరు నుంచి 12 ఏళ్ల వారు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాలను పాటించాలంటున్న శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.
ఇవీ చూడండి:టీకా ఉత్పత్తిపై భారత్తో రష్యా సంప్రదింపులు
TAGGED:
Corona in Telangana State