రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా పదోన్నతి చేకురింది. వారిలో కార్తికేయ, రమేశ్ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావులకు డీఐజీలుగా అవకాశం లభించింది.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు - Six are promoted to IPS officers
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా ప్రమోషన్ వచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డీఐజీ స్థాయిలో ఆరుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఐజీ స్థాయిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా కార్తికేయ, డీఐజీ స్థాయిలో పోలీస్ అకాడమీ ఉపసంచాలకులుగా రమేశ్ నాయుడు, డీఐజీ స్థాయిలో రామగుండం పోలీస్ కమిషనర్‌గా సత్యనారాయణ, సీఐడీ డీఐజీగా సుమతి, సీఐడీ డీఐజీగా శ్రీనివాసులు, సైబరాబాద్ సంయుక్త సీపీగా వెంకటేశ్వరరావు, మాదాపూర్ డీసీపీగా వెంకటేశ్వరరావులకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చూడండి :అక్కడ గాంధీ విగ్రహానికి మాస్క్ కట్టారు