తెలంగాణ

telangana

ETV Bharat / state

బీరుపై ఆంక్షలు - EXCISE DEPARTMENT

వేసవిలో మందు బాబులకు చల్లని బీరు అంటే ఎంతో మక్కువ. ప్రభుత్వానికి తక్కువ ఆదాయం వచ్చే బీరు విక్రయాలపై అబ్కారీ శాఖ ఆంక్షలు విధించింది.

బీరు సరఫరాపై ఆంక్షలు

By

Published : Mar 1, 2019, 8:51 AM IST

రాష్ట్రంలో మద్యం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవడానికి అధికారులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. లైసెన్స్​దారులకు 75శాతం లిక్కర్‌, 25శాతం బీరు సరఫరా చేయాలని అబ్కారీ శాఖ మద్యం డిపోల ఇంఛార్జిలను ఆదేశించింది. బీరు కంటే లిక్కర్‌ విక్రయాలపై ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తున్నందున బీరు సరఫరాపై ఆంక్షలు విధించారు.
లిక్కర్‌ తయారీ ధరపై 160 నుంచి 224శాతం వరకు ఎక్సైజ్‌ సుంకం విధిస్తారు. అదే బీరుపై అయితే 108 నుంచి 115శాతం వరకు మాత్రమే వేస్తారు. బీరు కంటే లిక్కర్‌ అమ్మకాలపై ప్రభుత్వానికి రెట్టింపు ఆదాయం వస్తోంది. క్రమంగా బీరు విక్రయాలను తగ్గించాలని ఆబ్కారీ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే మరో రెండు, మూడు వేల కోట్లు అదనపు ఆదాయం ఖజానాకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details