తెలంగాణ

telangana

ETV Bharat / state

Grafting vegetables: ఇలా చేస్తే నాణ్యమైన కూరగాయలు పండించవచ్చు.. - నాణ్యమైన పద్దతిలో అంటుకట్టే విధానం

భూమిపై రోజురోజుకు జనాభా పెరుగుతుంది. అరణ్యాలు కరిగి.. జనావాసాలుగా మారుతున్నాయి. పండించే భూమి మాయమై.. కాంక్రీట్​ నగరాలుగా మారుతున్నాయి. ఈ సమయంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా కూరగాయలు అందించడానికి సరికొత్త విధానాలు పాటించాలి. అందులో కూరగాయలు అంటు కట్టడం చాలా ముఖ్యమైనది(Grafting vegetables). దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

vegetables
vegetables

By

Published : Sep 29, 2021, 10:47 AM IST

పెరుగుతున్న జనాభాకు సరిపడ కూరగాయలను అందించడానికి సరికొత్త విధానాలు పాటించడం ఎంతో అవసరం(Grafting vegetables). సాధారణ పద్ధతిలో కూరగాయలను పండించే సమయంలో నేల ఆధారిత తెగుళ్లు, పురుగుల సమస్య, ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంట దిగుబడికి అడ్డంకులుగా మారుతున్నాయి. వీటన్నింటిని సాధ్యమైనంత వరకు తట్టుకుని మంచి దిగుబడిని, నాణ్యతను అందించే కొత్త విధానమే అంటుకట్టడం. ఈ విధానాన్ని అవలంబించడానికి వాతావరణ అడ్డంకుల్ని, చీడపీడలను తట్టుకునే నాణ్యమైన వేరువ్యవస్థను కలిగిన మొక్కలను తీసుకొని, మంచి దిగుబడినిచ్చే రకాలతో అంటుకట్టాలి(process of grafting).

ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం నేల ఆధారిత వేరుకుళ్లు తెగుళ్ల నుంచి మొక్కలను రక్షించడం. నాణ్యమైన మొక్కల సదుపాయం అందుబాటులో లేనప్పుడు, వాటి విత్తనాలను తెచ్చుకుని ప్రోట్రేలలో నాటి పెంచుకోవాలి. మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చాక వేరు మొక్కలను, కాండం మొక్కలను అంటుకట్టడం కోసం ఉపయోగించుకోవచ్చు. మొక్కలను గ్రీన్‌హౌస్‌ విధానంలో లేదా పొలంలో పెంచుకోవచ్చు.

ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విధానంలో ఏయే కూరగాయలను అంటుకట్టవచ్చు? అంటుకట్టే విధానాలు ఎన్ని రకాలున్నాయి? ఒకే మొక్కపైన వేర్వేరు రకాల మొక్కలను అంటుకట్టవచ్చా? ఒకే మొక్క నుంచి రెండు వేర్వేరు కూరగాయలు ఎలా పొందవచ్చు? అంటుకట్టడానికి కావాల్సిన పరికరాలు ఏమున్నాయి? ఆ పరికరాలు ఎక్కడ లభిస్తాయి? అంటుకట్టే విధానాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? తదితర వివరాలు అక్టోబరు ‘అన్నదాత’లో ప్రచురితమయ్యాయి.

ఇదీ చూడండి:Agricultural Progress: మూడో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్​

ABOUT THE AUTHOR

...view details