Chain Snatcher Case: రాజస్థాన్‌కు చెందిన ఉమేశ్ దొంగతనాల్లో సిద్ధహస్తుడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థిరపడి అనేక చోరీలుచేశాడు. సూరత్, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లో కలిపి 300కు పైగా గొలుసు దొంగతనాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈనెల 19న హైదరాబాద్‌లో 5 గొలుసు చోరీలకు పాల్పడగా ఎస్వోటీ పోలీసులు పక్కా ప్రణాళికతో సాంకేతిక దర్యాప్తు, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అతడి ఆచూకీ కనిపెట్టారు.
Chain Snatcher Case: గుజరాత్‌లోనూ మోస్ట్ వాంటెండ్‌గా ఉమేశ్.. హైదరాబాద్ పోలీసులకు చిక్కులు - గొలుసు చోరీలు
Chain Snatcher Case: హైదరాబాద్‌లో వరుస గొలుసు చోరీలతో హడలెత్తించిన దొంగ పోలీసులకు చిక్కినా అరెస్టుకు ఆంటకాలు ఎదురవుతున్నాయి. గుజరాత్‌లో దొంగను గుర్తించగా స్థానిక పోలీసుల అతడ్ని అప్పగించేందుకు ససేమిరా అంటున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర పోలీసులు ప్రత్యామ్నాయమార్గాల్ని అన్వేషిస్తున్నారు.
accused in Surat: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. మనవాళ్లూ ఇక్కడినుంచి విమానంలో అక్కడికి వెళ్లారు. కానీ గుజరాత్‌లోనూ మోస్ట్ వాంటెండ్‌గా ఉన్న ఉమేశ్‌ను హైదరాబాద్ పోలీసులకు అప్పగించడానికి సూరత్ పోలీసులు ససేమిరా అన్నారు. ఉమేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామని కోర్టులో పీటీ వారెంట్ వేసి నిందితుడిని తీసుకెళ్లాలని సూరత్ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సూచించారు. దీంతో ఆ దిశగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Chain snatching in Hyderabad: హైదరాబాద్‌లో 5 చోరీలను ఉమేశ్ పక్కా వ్యూహంతో చేశాడు. ఈ నెల 18న నాంపల్లి రైల్వే స్టేషన్ రైలు దిగిన ఉమేశ్ నేరుగా లాడ్జ్‌కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నాడు. అదే రోజు సాయంత్రం జియాగూడలో స్కూటీ చోరీ చేశాడు. ఈనెల 19న ఉదయం 11 నుంచి 5 గంటల లోపు మూడు కమిషనరేట్ల పరిధిలో 5 గొలుసు దొంగతనాలు చేశాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి మారేడ్‌పల్లి వచ్చి ఓ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లాడు. తుకారాంగేట్ పీఎస్ పరిధిలో మరో మహిళమెడలోని గొలుసు దొంగతనం చేశాడు. మేడిపల్లి వైపు వెళ్లి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లాడు. సాయంత్రం 5 గంటలకు స్కూటీ వదిలేసి 6 గంటల సమయంలో హోటల్ గది ఖాళీ చేసి వెళ్లిపోయాడు. సూరత్ పోలీసులు ఉమేశ్‌ను రిమాండ్‌కు తరలించిన తర్వాత ఇక్కడి కేసులను కోర్టులో సమర్పించి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.