తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యాహక్కు చట్టం అమలయ్యేలా చూడండి'

తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలయ్యేలా చూడాలని ప్రైవేటు అధ్యాపకులు డిమాండ్​ చేశారు. తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజ్ ఎంప్లాయిస్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు.

chalo raj bhavan
'విద్యాహక్కు చట్టం అమలయ్యేలా చూడండి'

By

Published : Dec 20, 2020, 1:56 PM IST

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రైవేటు అధ్యాపకులు చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజ్ ఎంప్లాయిస్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఆందోళన చేస్తున్న అధ్యాపకులను అరెస్ట్​ చేసి పంజాగుట్ట ఠాణాకు తరలించారు.

కరోనా పరిస్థితుల్లో జీవో నంబర్ 45 ప్రకారంగా ఆయా యాజమాన్యాలు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్​ చేశారు. తెలంగాణ విద్యాహక్కు చట్టం అమలయ్యేలా చూడాలని కోరారు. సాంకేతిక కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ, పీసీఐ నిబంధనల ప్రకారంగా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు 6 నెలల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలన్నారు. ప్రైవేటు అధ్యాపకులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి:అంతరిక్షంలో ఆంధ్రా అమ్మాయి అద్భుతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details