రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది నేటితో ముగిసింది. మధ్యాహ్నం హకీంపేట వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా మండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, మంత్రులు రాష్ట్రపతి కోవింద్‌కు వీడ్కోలు పలికారు.
నేటితో ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది - ముగిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన ముగించుకొని నేడు దిల్లీ బయలుదేరారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, మంత్రులు ఆయనకు వీడ్కోలు పలికారు.
నేటితో ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న రాష్ట్రానికి వచ్చారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బసచేసిన రామ్ నాథ్ కోవింద్... 22న రాజ్ భవన్లో గవర్నర్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. 23 నుంచి 26 వరకు తమిళనాడు, పాండిచ్చేరిలో పర్యటించారు. నిన్న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. నేడు పర్యటన ముగించుకొని దిల్లీకి బయలుదేరారు.
ఇవీ చూడండి: ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?