అంతర్జాలంలో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు వింటున్న విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్థులు మోసపూరిత లింకులు పంపుతున్నారని, వాటిని క్లిక్ చేస్తే.. మాయమాటలు చెప్పి నగదు కాజేస్తున్నారని వివరించారు.
ఆన్‌లైన్ చదువులు.. పాటించండి జాగ్రత్తలు
సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్ క్లాసులు వింటున్న విద్యార్థులనూ.. వదలడం లేదు సైబర్ నేరగాళ్లు. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ చదువులు.. పాటించండి జాగ్రత్తలు
మైనర్లను కొందరు ఇలాగే వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సైబర్ నేరస్థుల మాయలో విద్యార్థులు పడకుండా వారి తల్లిదండ్రులు పర్యవేక్షించాలన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలపై తాము సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. నేరాలకు పాల్పడిన వారిని ఎక్కడున్నా పట్టుకుంటామన్నారు.
ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'