తెలంగాణ

telangana

By

Published : May 6, 2020, 7:35 PM IST

ETV Bharat / state

ఆగిన కుమ్మరి చక్రం.. ఆకలితో నిత్యం పోరాటం

నడి వేసవి.. మిట్ట మధ్యాహ్నం.. ఓ వృద్ధుడు.. ఒళ్లో కుండ పెట్టుకుని దీనంగా రహదారి పక్కనే ఎదురుచూస్తున్నాడు. ఒక్క కుండ అయినా అమ్మకపోతానా.. నా కుటుంబం ఆకలి తీరకపోతుందా అని అతని కళ్లల్లో ఆశ. అతన్ని పలకరిస్తే కరోనా.. లాక్​డౌన్​ వల్ల తాము పడుతున్న బాధలను ఏకరువు పెట్టాడు. రాష్ట్రంలో లాక్​డౌన్​తో కుమ్మరులు పడుతున్న ఇబ్బందులకు దర్పణమిది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వీరు వేడుకుంటున్నారు.

potters-problems-due-to-lock-down-period-in-krishna-district
ఆగిన కుమ్మరి చక్రం.. ఆకలితో నిత్యం పోరాటం

తమకు ఆసరా అవుతుందనుకున్న కాలంలో కరోనా వారి ఆశల్ని వమ్ము చేసింది. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతూ.. తమ కుటుంబాలు పస్తులు పడుతున్న వేదన చూడలేక కుమ్మరులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఆంజనేయులు అనే కుమ్మరి మండుటెండలో రోడ్డు ప్రక్కన కూర్చుని ఒళ్లో మట్టి కుండ పెట్టుకుని అమ్మాలని చేసిన ప్రయత్నం చూస్తే కలిచివేయక మానదు. చాలా రోజులుగా అలా చేస్తున్నా.. ఒక్క కుండా అమ్ముడుపోక కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. వేసవి వచ్చినప్పటి నుంచి లాక్​డౌన్​తో కుమ్మరుల బతుకు దుర్భరమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో ఈ సమయంలో ప్రతి రోజు వంద వరకు మట్టి కుండలు అమ్మి.. కాస్తో.. కూస్తో లాభం కళ్లచూసేవారమని చెబుతున్నాడు. ప్రభుత్వం తమలాంటి వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details