రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్ ఒక గెస్ట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అక్కడ మంత్రి ఏ ఒక్కరోజు కూడా గడపలేదని కేవలం ఒక అతిథిలా వచ్చిపోతుంటారని అన్నారు.
సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఒక గెస్ట్: పొన్నం ప్రభాకర్ - మంత్రి కేటీఆర్‌పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానవ హక్కులు హరించిపోతున్నాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఎప్పుడు జిల్లాలో పర్యటించినా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారని.. మంత్రికి ఇంత అభద్రతా భావం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఒక గెస్ట్
మంత్రి జిల్లాలో పర్యటిస్తున్నారంటే కాంగ్రెస్ నేతలను మందుస్తుగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఎందుకంత భయమని ఆయన ప్రశ్నించారు? ఒక వేళ తనకు తెలియకుండా అరెస్టులు జరిగితే వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:భారత్, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు