Young Man Absconded With Rs 7 Crore Worth Of Diamonds: హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పీఎస్ పరిధిలోని రూ.7కోట్లు బంగారం, వజ్రాభరణాలతో పరారైన నిందితుడి గురించి ఎస్సార్ నగర్పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజిలను పరిశీలించడంతో పాటు.. కారు జాడను కనుక్కునే పనిలో పడ్డారు.
మాదాపూర్‌లో నివాసం ఉండే రాధిక.. నగల దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని బంగారం, వజ్రాభరణాలను వాట్సాప్ ద్వారా మార్కెటింగ్ చేస్తుంది. వినియోగదారులకు నచ్చితే నేరుగా.. వారి ఇంటివద్దకే డెలివరీ చేస్తారు. ఈ క్రమంలో అనూష అనే మహిళ.. ఆమె వద్ద రూ.50లక్షలు విలువ చేసే వజ్రాభరణాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లో ఉండే సిరిగిరి రాజు జువెల్లర్స్ నుంచి రూ.7కోట్లు విలువ చేసే వజ్రాభరణాలను తీసుకురమ్మని రాధిక డ్రైవర్ శ్రీనివాస్‌కు చెప్పింది. కోట్లలో ఆభరణాలు కళ్లముందు కనబడటంతో.. శ్రీనివాస్‌లో ఆశపుట్టింది. అదును కోసం చూస్తూ.. తగిన ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.