ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో వ్యక్తి అరెస్ట్​ - arrest

జీఎస్టీ ఎగవేత కేసులో ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​కు చెందిన కౌశిక్ శక్తి బాబురాం అరెస్టు అయ్యాడు. హైదరాబాద్​తో పాటు దేశవ్యాప్తంగా 21 సంస్థలను జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన ఇతను అక్రమ లావాదేవీలకు తెర తీశాడు.

జీఎస్టీ
author img

By

Published : Aug 27, 2019, 5:02 AM IST

Updated : Aug 27, 2019, 7:26 AM IST

జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో వ్యక్తి అరెస్ట్​

హైదరాబాద్​తో పాటు దేశవ్యాప్తంగా 21 సంస్థలను జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడిన వ్యక్తిని రాష్ట్ర జీఎస్టీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​కు చెందిన కౌశిక్ శక్తి బాబురాం తెలంగాణలో నాలుగు సంస్థలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ సంస్థల వ్యాపార కార్యకలాపాలను పరిశీలించగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

20.08 కోట్ల పన్ను ఎగవేత

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రకరకాల ఉత్పత్తులను హైదరాబాద్​కు తరలించి జీఎస్టీ చెల్లించకుండానే వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ ఏడాది మార్చిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నాలుగు సంస్థలు దాదాపు రూ.150 కోట్లకు పైగా విలువైన వ్యాపారాలు నిర్వహించినట్లు తేలింది. ఇందుకు సంబంధించి రూ. 20.08 కోట్ల వస్తు సేవల పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని రిమాండ్​కు తరలించామని జీఎస్టీ చీఫ్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి: విద్యుత్​ ఒప్పందాలపై సీబీఐ విచారణకు సిద్ధంకండి: లక్ష్మణ్

Last Updated : Aug 27, 2019, 7:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details