హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో... సీఎం కేసీఆర్ ఏ, బీ ఫారాలు పంపిణీ చేశారు. రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని.. గెలిచిన తర్వాత అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సూచించారు. అన్ని చోట్లా ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉందన్న కేసీఆర్.. టికెట్లు రానివారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.
ప్రజలు తెరాసకే సానుకూలం.. గెలుపు కారుదే..: కేసీఆర్ - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ...
తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీకి విధి విధానాలపై వివరించారు.
ప్రజలు తెరాసకే సానుకూలం.. గెలుపు కారుదే..!
టికెట్లు రానివారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని.. ఎమ్మెల్యేలను అభినందించారు.
Last Updated : Jan 9, 2020, 4:56 PM IST