తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reacts On 111 GO : '111 జీవో నిర్ణయం వెనక రూ.లక్షల కోట్ల కుంభకోణం'

Revanth Reddy Reacts On 111 GO : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 111 జీవో ఆదేశాల వెనకున్న నేపథ్యాన్ని గమనించాలని రేవంత్​రెడ్డి అన్నారు. జంట జలాశయాలను రక్షించేందుకు 1996లో 111 జీవోను ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. దీనికి సంబంధించి 84 గ్రామాలను బయో కన్సర్వేషన్​ జోన్​లో పెట్టారన్నారు. నిజాం, సమైక్య పాలకులు కూడా నగరాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 111 జీవోను అమలు చేశారన్నారు.

By

Published : May 22, 2023, 6:03 PM IST

Updated : May 22, 2023, 7:33 PM IST

Revanth Reddy Reacts On 111 GO
Revanth Reddy Reacts On 111 GO

'111 జీవో నిర్ణయం వెనక రూ.లక్షల కోట్ల కుంభకోణం'

Revanth Reddy Reacts On 111 GO : 111 జీవో రద్దు నిర్ణయంపై నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కొన్న భూముల వివరాలను కూడా ఈ కమిటీ సేకరిస్తుందని వివరించారు. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ లావాదేవీలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

1908లో హైదరాబాద్​కు వరదలు వచ్చి 50 వేల ప్రాణ నష్టంతో పాటు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. వరద నివారణకు ఆనాడు నిజాం గ్లోబల్ టెండర్లు పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యంలో మూసీ, ఈసీ నదులపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్​ను నిర్మించారని వివరించారు. ఆ రెండు జంట జలాశయాలను రక్షించేందుకు 1996లో 111 జీవోను నాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.

111 జీవో రద్దు వెనక కుట్ర ఉంది?: ఈ సందర్భంగా 84 గ్రామాలను బయో కన్సర్వేషన్ జోన్​లో పెట్టారని తెలిపారు. నిజాం, సమైక్య పాలకులు కూడా నగరాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకున్నారన్న రేవంత్​రెడ్డి.. కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. 111 జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ప్రమాదమన్న ఆయన.. ఆ జీవో రద్దు వెనక కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 80 శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లినట్లు ఆరోపించారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్​లను విధ్వంసం చేసే హక్కు కేసీఆర్​కు ఎవరిచ్చారని నిలదీశారు. దీని వెనక రూ.లక్షల కోట్ల కుంభకోణం దాగుందని విమర్శించారు. మొత్తం భూములు పేదల నుంచి కొనుగులు చేశాక.. ఇప్పుడు జీవో రద్దు చేశారని ఆరోపించారు. బినామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలన్న రేవంత్​.. బీఆర్​ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ చేస్తోందని ఆరోపించారు.

111 జీవోపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి?: ఇది బీజేపీ, బీఆర్​ఎస్​ల మధ్య కుదిరిన ఒప్పందమని విమర్శించారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్​లు ఈ విధ్వంసానికి కారణమని పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో త్వరలో విధ్వంసం పొంచి ఉందని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ లేకుండా లక్షా 30 వేల ఎకరాలకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 111 జీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఎందుకు చేయలేదని నిలదీశారు. జంట నగరాలను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే కిషన్​రెడ్డి ఏజెన్సీలకు పిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.

'కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకం. 111 జీవో రద్దు హైదరాబాద్‌కు అణు విస్ఫోటం కంటే ప్రమాదం. కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లో 80 శాతం భూములు. 111 జీవో నిర్ణయం వెనక రూ.లక్షల కోట్ల కుంభకోణం. పేదల నుంచి భూములు కొనుగులు చేశాక.. జీవో రద్దు చేశారు. కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు కొన్న భూముల వివరాలు కమిటీ సేకరిస్తుంది. బినామీ యాక్ట్​ను కేంద్రం పటిష్టంగా అమలు చేయాలి'. -రేవంత్​రెడ్డి, టీపీపీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : May 22, 2023, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details