కరెంటు బిల్లులు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని జెన్కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు కోరారు. లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వినియోగదారులు నేరుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించడం సాధ్యం కానందు వల్ల ఈ సౌకర్యం వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుత బిల్లులే కాకుండా గతంలో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించాల్సివుందని చెప్పారు.
'విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించండి' - lock down
విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా బకాయిలు చెల్లించాలని జెన్కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ వల్ల నేరుగా నగదు చెల్లించడం సాధ్యం కాదన్నారు.

'విద్యుత్ బిల్లు ఆన్లైన్ చెల్లించండి'
లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ విద్యుత్ సంస్థలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 24 గంటల పాటు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాయని చెప్పారు. ఈ సదుపాయం నిరాటంకంగా కొనసాగడానికి వినియోగదారులు బిల్లులు చెల్లించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.