సివిల్స్ అర్హత సాధించిన అభ్యర్థులు అంకితభావంతో ప్రజాసేవ చేయాలని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు మెచ్చే విధంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సివిల్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను కమిషనర్ మహేష్ భగవత్‌తో కలిసి ఆయన సన్మానించారు.
ఐదేళ్లుగా సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులను తాను ప్రోత్సహిస్తున్నట్లు... అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. తన సూచనలు సలహాలు పాటించి ర్యాంకులు సాధించిన అభ్యర్థులను ఆయన అభినందించారు.