కరోనా వైరస్ రాష్ట్రాన్ని భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఈ నెల 31వరకు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అధికారులు ఉస్మానియా, వాటి అనుబంధ కళాశాలలను బంద్ చేశారు.
ఓయూ విద్యార్థులపై కేసు నమోదు - case filed on ou students
కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
![ఓయూ విద్యార్థులపై కేసు నమోదు OU STUDENTS Strike in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6460752-141-6460752-1584574639866.jpg)
ఓయూ విద్యార్థులపై కేసు నమోదు
ఓయూ విద్యార్థులపై కేసు నమోదు
వసతి గృహాల్లో విద్యుత్, నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. దీనివల్ల అసహనానికి గురైన విద్యార్థులు ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ధర్నా చేపట్టినందుకు ఓయూ పోలీసులు సుమోటోగా తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: ఆ ఐటీ సంస్థ ఆఫీస్ కొబ్బరి తోటలోనే!
Last Updated : Mar 19, 2020, 6:55 AM IST