తెలంగాణ

telangana

ETV Bharat / state

సేంద్రియం-ఆరోగ్యమంత్రం

తాగే నీళ్ల నుంచి ఆహారం దాకా అన్నీ కల్తీమయమే. దీనికి తోడు కూరగాయలు, పండ్ల సాగులో రసాయనాల వాడకం జనాలను భయపెడుతోంది. వీటన్నింటికి సమాధానంగా సేంద్రియ ఉత్పత్తులన్నీ ఒకే వేదికపై దొరికితే అంతకంటే ఇంకేం కావాలి.

By

Published : Mar 4, 2019, 10:15 AM IST

Updated : Mar 4, 2019, 12:33 PM IST

సహజమే మాహాభాగ్యం

సహజమే మాహాభాగ్యం
హైదరాబాద్​ శిల్పారామంలో సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, ఉత్పత్తులు కొలువుదీరాయి. రాత్రి బజార్​లో తెలంగాణ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నిర్వహిస్తున్న ప్రకృతి-సేంద్రియ ఉత్పత్తుల మేళా ఆకట్టుకుంది.

ఇంట్లోనే సేద్యం..
మిద్దెపై పంటలు పండించే పద్ధతులపై అవగాహన కల్పిస్తూ హోంక్రాప్​ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్​ అందరి దృష్టిని ఆకర్షించింది. రసాయనాలు వాడకుండా ఇంట్లోనే కూరగాయలను పండించే మెళకువలను ప్రతినిధులు వివరించారు.

ప్రకృతి తీర్థం...
మేళాలో​
నీరా స్టాల్ప్రత్యేకంగా నిలిచింది. దీనిని ప్రకృతి సిద్ధమైన పానీయంగా సంస్థ ప్రతినిధులు అభివర్ణించారు. ఎన్నో వ్యాధులు నయమవుతాయని కూడా వివరించారు.

సహాజ సాధనాలు...
రైతులు తయారు చేసిన పరికరాలు ఆకట్టుకున్నాయి. జంతువులు, పక్షులు నుంచి పంటలు సంరక్షించుకునేందుకు వీలుగా ఈ సాధనాలను వెలుగులోకి తెచ్చామని కర్షకులు తెలిపారు.

స్పందనకు సంతృప్తి..
ప్రకృతి వ్యవసాయం, ఉత్పత్తులు చూసి సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. మూడురోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ మేళాకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు సంతృప్తి కనబరిచారు.

ఇవీ చూడండి:అభినందన్‌కు అవార్డు

Last Updated : Mar 4, 2019, 12:33 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details