తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్య సిబ్బందికి వన్‌ప్లస్‌ సంస్థ ఆపన్నహస్తం - వైద్య సిబ్బందికి వన్‌ప్లస్‌ సంస్థ ఆపన్నహస్తం

కరోనా కట్టడికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా వన్‌ప్లస్‌ సంస్థ వైద్య సిబ్బందికి ఆపన్నహస్తం అందించింది. వైద్య భద్రతా సామగ్రిని పంపిణీ చేసింది.

వైద్య సిబ్బందికి వన్‌ప్లస్‌ సంస్థ ఆపన్నహస్తం
వైద్య సిబ్బందికి వన్‌ప్లస్‌ సంస్థ ఆపన్నహస్తం

By

Published : Apr 3, 2020, 10:56 AM IST

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వన్‌ప్లస్‌ సంస్థ మద్దతుగా నిలిచింది. వైద్య సిబ్బందికి సహాయపడటానికి వైద్య భద్రతా సామగ్రిని అందించింది. వన్‌ప్లస్ తరపున ఆ సంస్థ హెడ్ రామగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని వైద్య విభాగానికి 7,050 మెడికల్ సూట్‌లు, 6,220 గాగుల్స్ అందించారు. రాష్ట్ర సర్కార్‌కు సహకరించిన వన్‌ప్లస్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు పీట్ ల్యూకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details