తెలంగాణ

telangana

ETV Bharat / state

కోట్లు ఉన్నాయని నమ్మించింది.. కోటి కొట్టేసింది..

తెలుగు మాట్రిమొనీలో ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను పరిచయం చేసుకుంది. నేను వైద్యురాలినంటూ నమ్మించి ఆర్థికంగా సాయం చేస్తే పెళ్లి చేసుకుంటానంది. చివరకు కోటి రూపాయలతో ఉడాయించిందో కి‘లేడీ’.

cheating
cheating

By

Published : Jun 2, 2020, 12:09 PM IST

Updated : Jun 2, 2020, 12:15 PM IST

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలోని వసంతనగర్‌కు చెందిన చైతన్య విహారి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతనికి తెలుగు మాట్రిమొనీలో అనుపల్లవి మాగంటి పేరిట ఓ మహిళ పరిచయమైంది. తాను వైద్యురాలిగా జూబ్లీహిల్స్‌లో ఉంటున్నట్లు నమ్మించింది. తనకు దక్కాల్సిన ఆస్తులు కుటుంబ సభ్యులు ఇవ్వనంటున్నారని, లీగల్‌ సమస్యల పరిష్కారానికి రూ.కోటి ఖర్చవుతుందని నమ్మబలికింది.

నీకు తోడుగా నేనుంటానంటూ బాధితుడు రూ.1.02 కోట్లు ఆమెకు బదిలీ చేశాడు. ఆ తర్వాత మహిళ అందుబాటులోకి రాలేదు. ఇదే తరహాలో ఎన్‌ఆర్‌ఐలకు వల విసురుతున్న ఈమెను జూబ్లీహిల్స్‌ పోలీసులు గత నెల 27న అరెస్ట్‌ చేశారు. భర్తతోపాటు ఇతర కుటుంబ సభ్యులూ ఆమెకు సహకరిస్తున్నట్లు తేలింది. విలాస జీవితానికి అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Jun 2, 2020, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details