తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్లోబల్ వార్మింగ్​పై యుద్ధం..! - one person do war against global warming latest

కూడబెట్టిన ఆస్తులు వదులుకున్నాడు.. లక్షలు వచ్చే వృత్తిని వదిలేశాడు.. ప్రపంచాన్ని చుట్టేస్తూ ప్రచారం చేస్తున్నాడు. ఏంటనీ ఆశ్చర్యపోతున్నారా.. గ్లోబల్ వార్మింగ్​పై యుద్ధమే అతని లక్ష్యం. ఇప్పటికే 72 దేశాల్లో పర్యటించి ప్రముఖుల సంతకాలు తీసుకున్నాడు. తన ఆశయం కోసం జీవితాన్ని అంకితం చేసిన హైదరాబాది సతీశ్​​ షిఖాపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

war against global warming
గ్లోబల్ వార్మింగ్​పై యుద్ధం..!

By

Published : Nov 26, 2019, 2:34 AM IST

Updated : Nov 26, 2019, 11:55 AM IST

గ్లోబల్ వార్మింగ్​పై యుద్ధం..!

ఆశయాలు అందరికి ఉంటాయి.. కానీ వాటిని ఆచరణలో చూపే అవకాశం మాత్రం కొందరికే దక్కుతుంది. ఇదే కోవకు చెందిన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సతీశ్​ చాలా ఏళ్ల కిందట హైదరాబాద్​లో వచ్చి స్థిరపడ్డారు. ఇంటర్ ​వరకు ఇక్కడే చదివి... ఫ్యాషన్ రంగంపై ఉన్న మోజుతో ముంబయిలో కోర్సు చేశాడు. తర్వాత కెనడ వెళ్లి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేసి ఫ్యాషన్ డిజైనర్​గా మారాడు. సెలెబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్​గా పనిచేసే అవకాశం రావడం వల్ల డబ్బులు బాగానే సంపాదించాడు.

అనారోగ్యానికి కారణమౌతున్న గ్లోబల్ వార్మింగ్

క్షణం తీరిక లేకుండా.. రెండు చేతులా సంపాదిస్తున్న సతీశ్​ను ఒక సంఘటన పూర్తిగా మార్చేసింది. తన స్నేహితుడు మోహన్ నాయర్ రెండు కాళ్లు పనిచేయని తన కూతురిని వెంటబెట్టుకొని వచ్చాడు. చిన్న పిల్లలంటే ఎక్కువగా ఇష్టపడే సతీశ్​... ఆపాపను చూసి చలించిపోయాడు. చిన్నపిల్లల సంరక్షణ కోసం హ్యాపీ కిడ్స్ హెల్తీ కిడ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. పిల్లల అనారోగ్యానికి కారణమౌతున్న గ్లోబల్ వార్మింగ్​పై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రజలను చైతన్యం చేయడం..

మన భూమిని మనం కాపాడుకుందాం అనే నినాదంతో గ్లోబల్ వార్మింగ్​పై ప్రజలను చైతన్యం చేయడం ప్రారంభించాడు. దీనికోసం ఫ్యాషన్ డిజైన్ రంగాన్నీ వదులుకున్నాడు. ఆస్తులన్నీ అనాథ శరణాలయానికి రాసిచ్చాడు. 72 దేశాలు తిరిగి ఆయా దేశాల్లో ప్రధానులు, అధ్యక్షులు, ప్రముఖులు 1,200 మంది నుంచి సిల్క్ ఫాబ్రిక్ వస్త్రాలపై సంతకాలు, ఆటోగ్రాఫ్​లు సేకరించాడు. సిల్క్ ఫాబ్రిక్ వస్త్రాలన్నింటిని కలిపి కుట్టి 2 కిలోమీటర్ల బ్యానర్ తయారుచేసి విద్యాలయాలు, పాఠశాలల్లో ప్రదర్శిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాడు. గిన్నిస్ బుక్​లో స్థానం సంపాదించాడు.

యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో ఈ బ్యానర్​ను ప్రదర్శించాడు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాడు. ప్రపంచానికే విఘాతంగా మారిన పర్యావరణ కలుష్యంపై తన పోరుతో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.

ఇదీ చూడండి: అందుబాటులోకి రానున్న హైటెక్​ సిటీ- రాయదుర్గం మెట్రో

Last Updated : Nov 26, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details