తన బ్యాంకు ఖాతా నుంచి నగదువేరే ఖాతాకు వెళ్లినందుకు మనస్థాపం చెందిన ఓ నర్సు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేఘాలయకు చెందిన రీటా(32) జీవనోపాధి నిమిత్తం ఏడాదిన్నర కిందట నగరానికి వచ్చింది. బేగంపేట్‌లోని నైటింగేల్ హోంఫర్ హెల్త్ కేర్ సర్వీస్‌లో నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో వృద్దులకు సేవలు అందించడం కోసం నైటింగేల్ సంస్థ తమ వద్ద ఉన్న నర్సులను పంపిస్తూ ఉంటుంది.
తనకు వచ్చిన వేతనాన్ని బ్యాంక్‌లో జమ చేసుకుంటుంది రీటా. ఇటీవల తన చరవాణిలో డబ్బును కుటుంబసభ్యులకు పంపేందుకు ప్రయత్నించగా... పొరపాటున వేరే ఖాతాలో జమయ్యాయి. డబ్బులు గల్లతవ్వటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన రీటా... ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.