తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2021, 10:27 AM IST

ETV Bharat / state

Covid Call Center : 'కొవిడ్‌ కట్టడికి రాష్ట్రం తీసుకున్న చర్యలు ప్రశంసనీయం'

కొవిడ్‌ కట్టడికి రాష్ట్రం తీసుకున్న చర్యల్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన హితమ్ కాల్ సెంటర్.. కరోనా సమయంలో ఎంతో మేలు చేసిందని అభినందించింది. రాష్ట్రానికి వస్తున్న అవార్డులు, ప్రశంసలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే.. సాధ్యమయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హారీష్ రావు ట్వీట్ చేశారు.

Covid Call Center
హితమ్‌ కాల్ సెంటర్

కరోనా బారినపడ్డ బాధితులకు ఇంటి వద్దనే చికిత్స అందించటం సహా సమర్ధ పర్యవేక్షణకు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యలను నీతి ఆయోగ్‌ (NITI Aayog) ప్రశంసించింది. కరోనా తొలి దశవ్యాప్తి సమయంలో ఏర్పాటు చేసిన హితమ్‌ కాల్ సెంటర్ (HITAM Call Center Services)… ప్రజలకు ఎంతో మేలు చేసిందని నీతిఆయోగ్ అభినందించింది.

రోగి కొవిడ్ బారిన పడిన సమయం నుంచి… వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీయడం, అవసరమైన మందులు అందించడం, అత్యవసరమైతే ఆస్పత్రికి ఆంబులెన్సులు ఏర్పాటు చేయటం వంటి చర్యలను.. హితమ్ కాల్‌ సెంటర్‌ (HITAM Call Center Services) అద్భుతంగా చేసినట్లు నీతిఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. అలాగే.. హోం ఐసోలేషన్ కిట్లు అందించడం, ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించి.. బాధితులకు నయం అయ్యేలా చర్యలు చేపట్టారని ప్రశంసించింది. ప్రజలకు కొవిడ్ సమయంలో అత్యుత్తమ సేవలు అందించిందని అభినందించింది. మరోవైపు… రాష్ట్రానికి వస్తున్న అవార్డులు, ప్రశంసలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే.. సాధ్యమయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హారీష్ రావు ట్వీట్ చేశారు.

''కరోనా సమయంలో వైరస్ సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టెలీ మెడిసిన్ సేవలను (HITAM Call Center Services)అందుబాటులోకి తెచ్చింది. ఇరవై నాలుగు గంటలపాటు పని చేసేలా చర్యలు తీసుకుంది. ఎటువంటి సందేహాలు వచ్చినా 1800 599 4455 (HITAM Call Center Services)కు ఫోన్‌ చేయవచ్చని ప్రజలకు భరోసా కల్పించింది. ప్రభుత్వం ఈ సేవలను (HITAM Call Center Services)ఉచితంగా అందించి.. కరోనా సమయంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించింది.

పాజిటివ్ వచ్చిన వారికి 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంచి... ప్రతి రోజు కరోనా బాధితులకు కాల్‌సెంటర్ (HITAM Call Center Services)నుంచి ఫోన్‌ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన వారికి వైద్యులతో వీడియో కన్సల్టెషన్ ద్వారా మెడికల్ అడ్వైజ్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా మందుల వివరాలను పంపారు. లక్షణాలు ఎక్కువైనా... ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందైనా... వెంటనే 108 ద్వారా వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇంట్లో ఉన్నవారికి కూడా కాల్ సెంటర్ (HITAM Call Center Services)ద్వారా ధైర్యాన్ని కల్పించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు సలహాలు, సూచనలు ఇచ్చి.. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఆందోళనలో ఉన్నవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చింది.''

ఇదీ చూడండి:హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికోసం కాల్ సెంటర్

కొవిడ్​పై అనుమానాలా?.. కలెక్టరేట్‌లో మీ కోసం కాల్​సెంటర్

ABOUT THE AUTHOR

...view details