Niranjan Reddy Counter to Revanth Reddy : పత్తి గిట్టుబాటు ధరపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాయడమేంటని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పత్తి గిట్టుబాటు ధర రాష్ట్రం పరిధిలోని అంశమా, కేంద్రం పరిధిలోనిదా అని రేవంత్‌ను నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మాట తప్పిన ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ ఎంపీగా ఎప్పుడైనా నిలదీశారా అని రేవంత్‌ను ప్రశ్నించారు.
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని.. రేవంత్ రెడ్డి సూచనలు, సలహాలు అవసరం లేదని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.17,351 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు వివరించారు. పది విడతల్లో రైతుబంధు కింద.. రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఏటా రూ.10,500 కోట్ల వ్యయంతో ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నిరంజన్‌రెడ్డి వివరించారు.