తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యసేవల కోసమంటూ తీసుకెళ్లి మావోయిస్టులుగా మార్చేస్తున్నారు: ఎన్ఐఏ - NIA Charge sheet On Chaithanya Mahila Sangham

హైదరాబాద్‌కు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని రాధపై మావోయిస్టులు ఉదయ్, అరుణలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలో చేర్పించారని జాతీయ దర్యాప్తు సంస్థ వివరించింది. చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు డొంగరి దేవేంద్ర, దుబాసీ స్వప్న, చుక్క శిల్పలు.. వైద్యసేవల కోసం అంటూ రాధను అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లారని.. వీరి ముగ్గురితో పాటు మరికొందరు కూడా సామాజిక సేవ పేరిట అమాయక యువతులను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది.

Maoists
Maoists

By

Published : Dec 21, 2022, 11:47 AM IST

హైదరాబాద్‌కు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని రాధపై మావోయిస్టులు ఉదయ్, అరుణలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలో చేర్పించారని జాతీయ దర్యాప్తు సంస్థ వివరించింది. చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు డొంగరి దేవేంద్ర, దుబాసీ స్వప్న, చుక్క శిల్పలు.. వైద్యసేవల కోసం అంటూ రాధను అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లారని అభియోగపత్రంలో ఎన్ఐఏ వివరించింది. వీరి ముగ్గురితో పాటు మరికొందరు కూడా సామాజిక సేవ పేరిట అమాయక యువతులను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షిస్తున్నారని తెలిపింది. చాలా మంది యువతులను ఆ పార్టీలో చేర్చారని, మరి కొందర్ని చేర్చేందుకు ప్రయత్నించారని వివరించింది. దీని వెనుక భారీ కుట్ర ఉందని, దాన్ని వెలికి తీసేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు ఏపీలోని విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసింది. నర్సింగ్‌ విద్యార్థిని అయిన తన కుమార్తెను సీఎంఎస్‌ ప్రతినిధులు తీసుకెళ్లి మావోయిస్టు పార్టీలో చేర్పించారంటూ హైదరాబాద్‌ కాప్రాకు చెందిన పల్లెపాటి పోచమ్మ ఈ ఏడాది జనవరిలో విశాఖ గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దానిపై పెదబయలు పోలీసుస్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. దేవేంద్ర, స్వప్న, శిల్పలను అరెస్టు చేసింది. వారి ప్రమేయంపై తాజాగా అభియోగపత్రం దాఖలు చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details