తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona Cases: పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 4,570 కేసులు నమోదు.. - ఏపీ కరోనా కేసులు

AP Corona Cases: ఏపీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా.. 4,570 మందికి వైరస్ సోకింది. ఒకరు మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1124 కేసులు నమోదయ్యాయి.

new corona cases in ap today
new corona cases in ap today

By

Published : Jan 16, 2022, 6:45 PM IST

AP Corona Cases:ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 4,570 మందికి వైరస్ సోకగా.. ఒకరు మృతి చెందారు. మరో 669 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 26,770 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖ1,028, గుంటూరు 368, అనంతపురం 347, నెల్లూరు 253, తూర్పుగోదావరి జిల్లాలో 233 చొప్పున కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు.

పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 4,570 కేసులు నమోదు..

దేశంలో కరోనా ఉద్ధృతి..
Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా.. 2,71,202 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 314 మంది మరణించారు. 1,38,331 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 37,122,164
  • మొత్తం మరణాలు: 4,86,066
  • యాక్టివ్ కేసులు: 15,50,377
  • మొత్తం కోలుకున్నవారు: 3,50,85721

దేశంలో ఒమిక్రాన్​ కేసులు..
Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్​లో టీకా పంపిణీ..
Vaccination in India: భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం 66,21,395 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరింది.

అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 20 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే 23,53,411 మందికి వైరస్​ అంటుకోగా.. 5,605 మంది మృతి చెందారు. ఇందులో దాదాపు 40 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

  • అమెరికాలో ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా విస్తరిస్తూ రోజుకు లక్షల మందికి అంటుకుంటోంది. శనివారం ఒక్కరోజే 4,02,735 కొత్త కేసులు వెలుగు చూశాయి. 882 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం కేసులు 66,662,877, మరణాలు 8,73,145కు చేరాయి.
  • ఫ్రాన్స్​లో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. డెల్టాతో పాటు ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభిస్తోంది. ఓ కొత్త వేరియంట్​ను గుర్తించటం కలకలం సృష్టిస్తోంది. శనివారం మరో 324,580 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 148 మంది మృతి చెందారు. 27వేల మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,894,255, మరణాలు 126,869కి చేరాయి.
  • ఇటలీలో వైరస్​ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1,80,426 మందికి వైరస్​ సోకింది. 239 మంది మరణించారు. 1,25,199 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 120,609కు చేరింది.
  • ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 1,03,836 మందికి వైరస్​ సోకగా.. 55 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,640, 386కు చేరింది.
  • అర్జెంటీనాలో కొవిడ్​ వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 96,652 మందికి వైరస్​ సోకింది. 88 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసులు 7,029,624కు చేరాయి.
  • బ్రిటన్​లో కొత్తగా 81,713 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 287 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1.5 కోట్లు దాటింది.
  • టర్కీలో 63వేలు, జర్మనీలో 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. బ్రెజిల్​, రష్యా, కొలంబియా, మెక్సికో, ఫిలిప్పీన్స్​, బెల్జియం వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజుకు దాదాపు 30వేలకుపైగా కొత్తగా వైరస్​ బారినపడుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details