రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని నిర్వహించాలని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆగస్టు 15న కేసీఆర్.. జాతీయ జెండా ఎగురవేసినట్లుగానే సెప్టెంబర్ 17న కూడా ఎగురవేయాలన్నారు. కేటీఆర్ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెట్టడం సరికాదన్నారు. రైతు రుణమాఫీకి వెంటనే నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. చిదంబరం లాంటి వ్యక్తి ఆర్టికల్ 370రద్దును మతంతో ముడిపెట్టడం తగదన్నారు.
జాతీయవాదం వేరు మతవాదం వేరు: దత్తాత్రేయ - dathathreya
కేటీఆర్ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెట్టడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దత్తాత్రేయ