తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

ఐక్యరాజ్య సమితి ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి వినతిపత్రం అందించారు.

ఎమ్మెల్యే సీతక్క

By

Published : Aug 6, 2019, 5:27 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల తొమ్మిదిన అధికారికంగా నిర్వహించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసిన ఆమె ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వారి జనాభా ఉన్న ప్రతి జిల్లాకు పది కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలు లేక డెంగ్యూ, మలేరియాతో గిరిజనులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఐదేళ్లు పూర్తైనా... ఆదివాసీల గురించి సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా వారి సమస్యలు పరిష్కరించే దిశగా దృష్టి పెట్టాలని కోరారు.

'ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

ABOUT THE AUTHOR

...view details