హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై చెత్త డబ్బాలు, ఇరుకైన రోడ్లు, నాళాలు అపరిశుభ్రత వల్ల రోడ్డుపై చెత్త పేరుకుపోయి అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్త.. నిలిచిపోయిన వాన నీరు వల్ల దోమల బెడద ఎక్కువైందని అంటున్నారు.
వారానికి ఒక్కసారి దోమల పొగ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని వారు వాపోతున్నారు. దోమల వల్ల ఎన్ని జెట్ కాయిల్స్, ఆలౌట్లు వాడిన ఉపయోగం లేకపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల డెంగ్యూ వంటి విషపూరిత జ్వరాల బారినపడి ఐదు మంది చనిపోయారని.. ఒక జవాన్ కూడా మృతిచెందాడని స్థానికులు అంటున్నారు.