మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే... మళ్లీ గెలిచి వస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనపై వేటు వేస్తే సీఎం కేసీఆర్ తప్పు చేసి ఇరుకున్నట్లేనన్నారు. శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడకూడదా, ప్రశ్నించే గొంతుక ఉండకూడదా అని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చర్యలు తీసుకుంటే నేలకు కొట్టిన బంతిలా తిరిగి పైకి లేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
'అలా చేస్తే సీఎం కేసీఆర్ ఇరుకున్నట్లే' - CM KCR latest news
మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే అంతకన్నా అదృష్టం ఏముందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
MLA Komatireddy Rajagopal Reddy latest news