తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలకు మియాపూర్​ సీఐ ఆపన్నహస్తం - corona virus news

లాక్​డౌన్​ నేపథ్యంలో పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. హైదరాబాద్​ మియాపూర్​ పరిధిలోని హఫీజ్​పేటలో వలస కూలీలకు మియాపూర్ సీఐ వెంకటేష్​ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ​

miyapur ci groceries distribution to migrated labour in hyderabad
వలస కూలీలకు మియాపూర్​ సీఐ ఆపన్నహస్తం

By

Published : Apr 29, 2020, 4:52 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో వలస కూలీలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. వీరి ఆకలి తెలుసుకున్న పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.హైదరాబాద్ మియాపూర్ హఫీజ్​పేట్​ ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు మియాపూర్ సీఐ వెంకటేష్ నిత్యావసర వస్తువులను అందజేశారు.
నిత్యావసర వస్తువులతో పాటు అన్నపూర్ణ క్యాంటీన్ సహకారంతో భోజనం అందజేశారు. పీఎస్​ ఆవరణలో వలస కూలీలకు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర వస్తువులను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details