తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీవాలకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు' - పశుసంవర్థక శాఖ అధికారులతో మంత్రి తలసాని సమావేశం

మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ అన్ని జిల్లాల పశు సంవర్థక శాఖ, టీఎస్‌ పాడి పరిశ్రాభివృద్ధి సంస్థ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

'జీవాలకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు'
'జీవాలకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు'

By

Published : Sep 24, 2020, 7:10 PM IST

రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల బారినపడిన జీవాలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హెచ్చరించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి మంత్రి అన్ని జిల్లాల పశు సంవర్థక శాఖ, టీఎస్‌ పాడి పరిశ్రాభివృద్ధి సంస్థ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు సంచాలకులు రాంచందర్, టీఎస్‌ఎల్‌డీఏ సీఈఓ డాక్టర్ మంజువాణి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విస్తృత చర్చ...

ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు, పాడి పశువులు, జీవాల్లో సీజనల్ వ్యాధులు, వైద్య సేవలందుతున్న తీరుపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో జీవాలకు అవసరమైన ఔషధాలు, టీకాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న దృష్ట్యా వినియోగంపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలో అన్ని పశువైద్యశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన మందులు ఆసుపత్రులలో లభ్యతపై ఉన్నత స్థాయి అధికారులతో బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామని మంత్రి తలసాని అన్నారు.

జీవాలకు అవసరమైన మందులు అందుబాటులో లేవని... వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు రైతుల నుంచి వస్తున్నాయని మంత్రి ప్రస్తావించారు. జీవాలకు అవసరమైన టీకాలను ఉత్పత్తి చేస్తున్న వీబీఆర్‌ఐని మేడ్చల్ జిల్లా కరకపట్లకు తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు.. తెరాస కసరత్తులు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details