హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సోమశిల, సింగోటం టూర్ బ్రోచర్‌ను పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. రాష్ట్రంలో పర్యటక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పర్యటకులు పెరిగారు
వందేళ్ల క్రితం కట్టిన దేవాలయాలు, గొప్ప చరిత్ర సోమశిలకు ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పర్యటకులు మూడు రేట్లు పెరిగారని తెలిపారు. ఇతర దేశాల టూరిస్టులు హైదరాబాద్‌లో దిగిన మూడు గంటల్లోనే సోమశిలకు చేరుకోవచ్చన్నారు.
సోమశిల, సింగోటం టూర్ బ్రోచర్ విడుదల ఇదీ చూడండి : కూడళ్లు, ఫుట్‌పాత్‌లపై మంత్రి కేటీఆర్ సమీక్ష