తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టికల్​ 370 రద్దు సాహసోపేత నిర్ణయం: కిషన్ రెడ్డి - భారత్​ 2025

ఆర్టికల్​ 370 రద్దుపై కశ్మీర్​లో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఈ విషయంలో భాజపా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా మోదీ పనిచేస్తున్నారని ప్రశంసించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

By

Published : Aug 27, 2019, 11:46 PM IST

'ఆర్టికల్​ 370 రద్దు సాహసోపేతమైన నిర్ణయం'

ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమీర్​పేటలోని సెస్​లో "భారత్​పై ఆర్టికల్​ 370 రద్దు ప్రభావం" అనే అంశంపై 'భారత్​ 2025' సంస్థ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో ఆర్టికల్‌ 370 అమల్లో ఉన్నప్పుడు కశ్మీర్‌లో భయంకరమైన పరిస్థితులు ఉండేవని... అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని తెలిపారు. అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధులు కూడా పక్కదారి పట్టాయని చెప్పారు. ఇప్పుడు 370 రద్దు కావడంపై కశ్మీర్​ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కశ్మీర్​లో రాళ్లు పట్టుకునే యువత... కంప్యూటర్లు పట్టుకునేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details