తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు వందలు... 5కిలోల పండ్లు

హైదరాబాద్ మూసాపేట్‌లోని వాక్ ఫర్ వాటర్ సంస్థ పండ్ల ప్యాకేజీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యమైన పండ్లు అందించే ప్రయోగం చాలా బాగుందని... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

minister-niranjan-reddy-visit- walk for water ngos fruits-packing-centre-at-moosapet-kukatpally-hyderabad
మూడు వందలు... 5కిలోల పండ్లు

By

Published : May 3, 2020, 1:27 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులకు అండగా ఉంటూ.. వినియోగదారులకు ప్రత్యక్షంగా పండ్లను చేరవేసేందుకు ఏర్పాట్లు చేసిన వాక్ ఫర్ వాటర్ సంస్థ సేవలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. కూకట్‌పల్లి మూసాపేట్‌లోని వాక్ ఫర్ వాటర్ సంస్థ పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

300 రూపాయలకు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్‌తో, మూడు వందలకు ఐదు కిలోల పండ్లు, సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ, వాక్ ఫర్ వాటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కాల్ సెంటర్‌కు ఇప్పటివరకు 28 లక్షల కాల్స్ వచ్చాయని... రైతుల నుంచి ప్రత్యక్షంగా 11 వందల 25 టన్నుల పండ్లును వినియోగదారులకు సంస్థ ద్వారా సరఫరా చేశామన్నారు. మరిన్ని నాణ్యమైన సేవల కోసం తపాలాశాఖతో ఒప్పందం చేసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్‌ భేష్‌'

ABOUT THE AUTHOR

...view details