KTR tweet on KCR KITS: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన "కేసీఆర్ కిట్స్" మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీ 13 లక్షల 30 వేలకు చేరినందుకు గర్వంగా ఉందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
తల్లీబిడ్డలకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో కిట్లు అందిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు.. అబ్బాయి పుడితే రూ. 12వేలు అందిస్తున్నామన్నారు. ప్రసూతి అనంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి పథకం కింద 300 వాహనాలను అందుబాటులో ఉంచామని కేటీఆర్ వివరించారు.