ఏరోస్పేస్, ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విమానాశ్రయాలతో పాటు హెలిపోర్ట్, సీ ప్లేన్‌లపై రాష్ట్రం ఆసక్తిగా ఉందని వెల్లడించారు. ఏవియేషన్ రంగం 14 శాతం వృద్ధితో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరమవుతాయని చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో మూడవరోజు వింగ్స్ ఇండియా-2020 ప్రదర్శనలో కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీతో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఏవియేషన్ రంగానికి అపార అవకాశాలు: మంత్రి కేటీఆర్ - ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ప్రాంతాల అనుసంధానం కోసమే రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహిస్తోన్న వింగ్స్ ఇండియా-2020 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పలువురు హాజరయ్యారు.
ఏవియేషన్ రంగానికి అపార అవకాశాలు: మంత్రి కేటీఆర్
నిర్వహణ, మరమ్మతులు నైపుణ్యాభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవియేషన్‌పై జీఎస్టీ తగ్గించేందుకు కేంద్రం విధానపర నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు.
ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి