హైదరాబాద్‌లో టాటా బోయింగ్ విజన్ విస్తరణపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బోయింగ్ -737 కీలక విడిభాగాల తయారీకి హైదరాబాద్ కేంద్రం అవడం రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు.
ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్
ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ మారుతోంది. బోయింగ్-737 విమానాల తయారీలో వినియోగించే కీలకమైన 'వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్ల' హైదరాబాద్‌లో తయారు కాబోతున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ కేంద్రమవడం రాష్ట్రానికే గర్వకారణం: కేటీఆర్
విమానతయారీ, రక్షణ ఉత్పత్తి రంగాల్లో ఇదోక కీలకమైన ముందడగని.. ఏవియేషన్ రంగంలో హైదరాబాద్ భాగస్వామ్యాన్ని పెంచుతోన్న టాటా, బోయింగ్ గ్రూపులకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లో ఉన్న తమ టాటా బోయింగ్ ఎయిరో స్పేస్ లిమిటెడ్ ఫెసిలిటీ ద్వారా మరిన్ని ఉత్పత్తులు తయారీ చేపడతామని బోయింగ్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ ఫెసిలిటీలో బోయింగ్ 737 విమానాల కొరకు రూపొందించే ఎయిర్ ఫిన్ నిర్మాణాలు.. గ్లోబల్ సరఫరా కొరకు ఉద్దేశించినవని ప్రకటించింది.
- ఇదీ చూడండి:విమాన రంగానికి తెలంగాణ రెక్కలు